.png&w=3840&q=75)

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ కేంద్రమైంది. రవాణా మార్గాల్లో సముద్ర మైన్స్ అమర్చేందుకు సిద్ధమవుతున్న ఇరాన్‌కు చెందిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భారీ దాడులు చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం హర్మూజ్ సమీపంలో ఇరాన్‌కు చెందిన 16 నౌకలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్‌లో మూడు సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన మయూరి నారీ అనే నౌక ఒమన్ తీరానికి సమీపంలో దాడికి గురైంది. ఇది భారత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. నౌకలో ఉన్న 20 మందిని ఒమన్ నేవీ రక్షించగా ముగ్గురు సిబ్బంది ఇంకా గల్లంతయ్యారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్, లెబనాన్‌లలోని పౌర ప్రాంతాలపై దాడులు కొనసాగించింది.
యుద్ధం 12వ రోజుకు చేరుకున్న ఈ ఘర్షణలో ఇప్పటివరకు 1,878 మంది మరణించగా 15,753 మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ పేలుళ్లు చోటుచేసుకోగా పలువురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలు అనేక డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశామని వెల్లడించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా పడిపోయింది. మరోవైపు చమురు సరఫరా అంతరాయం కలగకుండా ఉండేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) 400 మిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించింది.

.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!