

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కగిసో రబడ (3/25) అద్భుత బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. అనంతరం మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ సులభంగా ఛేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (87), శుభ్‌మన్ గిల్ (33) బలమైన ఆరంభం ఇవ్వగా, జోస్ బట్లర్ (39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ఓటమి తర్వాత గుజరాత్ మళ్లీ గెలుపు బాట పట్టింది. పవర్‌ప్లేలోనే 55 పరుగులు చేసిన సుదర్శన్, గిల్ జోరు ప్రదర్శించగా, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గిల్ స్టంపౌట్ అయ్యాడు. తర్వాత బట్లర్, సుదర్శన్ కలిసి జట్టును విజయానికి తీసుకెళ్లారు. ముందుగా రబడ ధాటికి సీఎస్కే పవర్‌ప్లేలోనే వికెట్లు కోల్పోయినా, రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును 158 పరుగుల వరకు తీసుకెళ్లాడు.











.webp&w=3840&q=75)









.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!