

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వచ్చే ఏడాదిన్నరలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమెండెడ్ భారత్‌నెట్ ప్రాజెక్ట్ (ABNP) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని విస్తరించి ప్రభుత్వ సేవలను సాంకేతికత ద్వారా ప్రజలకు చేరవేయడం లక్ష్యమని వెల్లడించారు. అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఐదు లక్షల గ్రామీణ ఇళ్లకు ఫైబర్ కనెక్టివిటీ అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,432 కోట్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది. ఏపీలో ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (APBIL) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13,426 గ్రామపంచాయతీల్లో డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ, నెట్వర్క్ అప్‌గ్రేడ్, కొత్త గ్రామాలకు కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టనున్నారు. డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!