

యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలోని దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న హీరోయిన్ సోనల్ చౌహన్ భారత ప్రభుత్వాన్ని సహాయం కోరారు. సోషల్ మీడియా ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇరాన్ పై కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యూఏఈ దేశాల్లో ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పలువురు స్వదేశానికి తిరిగి వెళ్లే మార్గం కోసం ఎదురుచూస్తున్నారు.
సోనల్ చౌహన్ తన సందేశంలో, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల నేను దుబాయ్‌లోనే నిలిచిపోయాను. విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియాకు ఎలా చేరుకోవాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సహాయం చేయాలి అని కోరారు.
అదేవిధంగా నటుడు మంచు విష్ణు, క్రీడాకారిణి పి వి సింధు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. సోనల్ చౌహన్ తెలుగు చిత్రసీమలో రెయిన్ చిత్రంతో అడుగుపెట్టారు. అనంతరం లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, ఎఫ్3, ద ఘోస్ట్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆదిపురుష్ చిత్రంలో మండోదరి పాత్ర పోషించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!