
సినిమాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA ప్రకటించింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదేవిధంగా ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇంకా ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని కారణంగా కోస్తా ఆంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!