

తెలంగాణలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూట విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించి, అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతాయి.
పరీక్షలు ఉన్నంతకాలం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించనున్నారు. అలాగే వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రకటించగా, జూన్ 12 న కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. విద్యార్థుల చదువుకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
రంజాన్ సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలలు మరియు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ప్రత్యేక సమయాలను అమలు చేయనున్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహించి, అనంతరం అదనపు బోధన తరగతులు చేపట్టనున్నారు. ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!