
.jpg&w=3840&q=75)
రసాయనాలు లేకుండా వ్యవసాయం లాభసాటిగా ఉండదనే అభిప్రాయాలను తప్పు నిరూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరిక నరసమ్మ, లాలం జ్యోతి సేంద్రియ సాగులో విజయాన్ని సాధించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆదాయం పొందడమే కాకుండా మరెందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి కృషిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ, బెర్లిన్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థలతో కలిసి యూరప్ దేశాల్లో సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు వీరిని ఎంపిక చేసింది.
నరసమ్మ ‘ఎనీటైం మనీ’ విధానంలో వివిధ కూరగాయలు, పండ్లజాతులను సాగు చేసి నెలకు సుమారు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. వ్యవసాయం చేస్తూనే వ్యవసాయ విద్యలో డిగ్రీ చదువుతున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన జ్యోతి ఆరోగ్యకరమైన ఆహారం లక్ష్యంగా ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించి ప్రస్తుతం రెండు ఎకరాల్లో 42 రకాల పంటలను పండిస్తూ సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. జీవామృతం, బీజామృతం, మల్చింగ్ వంటి ప్రకృతి విధానాలను అమలు చేస్తూ అనేక మంది రైతులకు మార్గదర్శకురాలిగా నిలిచారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!