

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
విశాఖపట్నం ఐటీ రంగం మరింత విస్తరించబోతోంది. కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ తో పాటు మరో ఏడు ఐటీ సంస్థలు నగరం లో తమ క్యాంపస్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ తొమ్మిది ఐటీ సంస్థల భూమిపూజ కార్యక్రమాలు నేడు (డిసెంబర్ 12 శుక్రవారం) జరగనున్నాయి. ఈ కార్యక్రమాల కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.
మధురవాడలో టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ACN ఇన్ఫోటెక్ సంస్థల క్యాంపస్లకు భూమిపూజ జరగనుంది. కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగుతాయి. ఈ ప్రాజెక్టు లు పూర్తవడం తో విశాఖ లో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు సృష్టి చెందనున్నాయి.







.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!