
గాసిప్స్

దక్షిణ ఫిలిప్పీన్స్లో జరిగిన ఫెర్రీ బోటు ప్రమాదంలో కనీసం 15 మంది మృతి చెందినట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ ప్రమాదానికి గురవ్వగా, సహాయక చర్యల్లో భాగంగా 316 మందిని సురక్షితంగా రక్షించారు.
ఇప్పటికీ 28 మంది ఆచూకీ తెలియరావడం లేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు కోస్ట్ గార్డ్తో పాటు ఇతర అత్యవసర బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!