
టెక్నాలజీ

కార్తీక మాసం చివరలోనూ నిత్యవసరాల ధరలు తగ్గడం లేదు. కూరగాయలు & కోడిగుడ్ల ధరలు సాధారణ వాణిజ్య రేట్ల కంటే విపరీతంగా పెరిగాయి.
గత నెలలో గుడ్లు ₹5–₹6 గా అమ్మకంలో ఉండగా, ఇప్పుడు ₹7–₹8 వరకు చేరాయి.
డజను గుడ్లు ₹98 వరకు విక్రయిస్తున్నారు.
కూరగాయల ధరలు కూడా కిలో ₹100–₹120 వరకు చేరుతున్నాయి, స్థానిక రైతులు, దళారుల కారణంగా ధరలు మరింత ఎగబాకుతున్నాయి.
ప్రస్తుతం కార్తీక మాసం ఉపవాసాలు, అయ్యప్ప దీక్షలు జరుగుతున్న కారణంగా గుడ్ల వినియోగం తక్కువగా ఉండే సమయంలో కూడా ఈ ధరల పెరుగుదల విశేషం. వ్యాపారులు సరఫరా తగ్గిన కారణంగానే ధరలు పెరిగినట్టు పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!