

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర భద్రతా పరిస్థితులు, మావోయిస్టు సమస్యలు, పోలీసు వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్‌తో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మావోయిస్టుల లొంగుబాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షాకు నివేదిక సమర్పించారు. ‘ఆపరేషన్ కగార్’లో తెలంగాణ పోలీసులు అందించిన సహకారాన్ని అమిత్ షా ప్రశంసించారు. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇదే విధంగా సహకారం కొనసాగించాలని సూచించారు. ఇంకా మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ఈగల్ టీమ్‌ను మరింత బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి కూడా సీఎం రేవంత్ వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్‌ను పెంచాలని కేంద్రాన్ని కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!