ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన గాయపడ్డారని ఇటీవల పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడటంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజెష్కియాన్ స్పందించారు. మొజ్తాబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
మొజ్తాబా ఖమేనీతో నిరంతరం సంప్రదింపులో ఉన్న తన స్నేహితుల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని యూసఫ్ పెజెష్కియాన్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.





.jpg&w=3840&q=75)















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!