
ఓటిటి

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మొదట మార్చి చివర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ నెల 30 న విడుదలకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో రామ్ చరణ్ ఈ విషయంపై స్పందిస్తూ, సినిమా ఆలస్యమవుతుందనే వార్తలను తేలికగా తీసుకోవాలని పేర్కొన్నారు. అయినప్పటికీ, విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడంతో సందేహాలు కొనసాగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ క్రీడా నేపథ్యంతో భావోద్వేగ కథగా రూపొందుతోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!