
సినిమాలు

కేంద్ర ప్రభుత్వం 15 వ ఆర్థిక సంఘం నిధుల మూడో విడతను విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణకు రూ. 387.53 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ. 1034.42 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో పెండింగ్లో ఉన్న నిధులను కేంద్రం దశలవారీగా విడుదల చేస్తోంది.
తెలంగాణకు ఇంకా సుమారు రూ. 2000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని సమాచారం. పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు.
ఇప్పటివరకు విడుదలైన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!