
క్రీడలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యం ఫోర్టిఫీకేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. ఐఐటి ఖరగ్పూర్ నిర్వహించిన అధ్యయనంలో ఎక్కువకాలం నిల్వ చేసినప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యంలో పోషక విలువలు తగ్గే అవకాశముందని తేలినట్లు సమాచారం. మెరుగైన పద్ధతిలో పోషకాలు అందించే మార్గాన్ని గుర్తించే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే రేషన్ కోటాలో ఎలాంటి తగ్గింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. ప్రస్తుత పంపిణీ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!