

సౌదీ అరేబియాలో హృదయ విదారక సంఘటన జరిగింది. మదీనా దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కా నుండి మదీనా వైపు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్‌తో బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ వివరాల ప్రకారం:
నవంబర్ 9 న పాటు మొత్తం 54 మంది యాత్రికులు హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లారు. ఈ పర్యటన 23 వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. బృందంలో నలుగురు ముందే కారులో మదీనాకు చేరగా, మరో నలుగురు మక్కాలోనే ఆగిపోయారు. మిగిలిన 46 మంది బస్సులో ప్రయాణం కొనసాగించారు.
మదీనాకు చేరుకునే ముందు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజామున కావడంతో చాలా మంది నిద్రలో ఉండటంతో బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ విషాదంలో అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ వంటి హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
సౌదీ ప్రమాదంపై భారత ఎంబసీ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.
హజ్ కమిటీ తెలిపిన ప్రకారం :
ఈ ఘటనలో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం యాత్రికులు నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లినట్లు కమిటీ ప్రకటించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!