మున్సిపల్ ఎన్నికల దిశగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించినట్లు బీఆర్ఎస్ తెలిపింది.
ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఇంచార్జ్‌గా నియమించి, ఎన్నికల వ్యూహాలు, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నేతలు ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని మరింత పటిష్టం చేయడం, ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!