
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రేపు సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై కూటమి నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పాలనలో సమన్వయం, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!