

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆధారిత ప్రకృతి వ్యవసాయం (APCNF) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్’ ఈ ఏడాది ఏపీసీఎన్‌ఎఫ్‌కు లభించింది. స్వీడన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, 1.5 మిలియన్ డాలర్ల నగదు బహుమతి (సుమారు రూ.14 కోట్లు) అందజేశారు.
ప్రకృతి హిత వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేస్తూ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న కార్యక్రమంగా ఏపీసీఎన్‌ఎఫ్‌ను ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ జ్యూరీ సభ్యురాలు ప్రొఫెసర్ లిండివే మజెలే సిబాండ ప్రశంసించారు. ఈ పురస్కారం లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!