
సినిమాలు

రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించబడిన బాలీవుడ్ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్‌కు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఈ నెల 5 న ఆయన తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. 2010 లో నిర్మించిన అతా పతా లాపతా సినిమా కోసం తీసుకున్న రూ.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.9 కోట్లకు పెరిగింది. చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టు జైలు శిక్ష విధించింది.
ఈ క్రమంలో నటుడు సోనూ సూద్ ఆర్థిక సాయం ప్రకటిస్తూ, ఇది దానం కాదని భవిష్యత్ చిత్రానికి అడ్వాన్స్‌గా ఇస్తున్నానని తెలిపారు. తాజాగా జెమ్ ట్యూన్స్ మ్యూజిక్ అధినేత ఇంద్రజీత్ సింగ్ రూ.1.1 కోట్ల సాయం అందిస్తానని ప్రకటించి, ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు రావాలని కోరారు. కష్టకాలంలో సహచరుడికి అండగా నిలవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!