
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రేపు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకునే ఆయన, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారన్న అంశాలపై ఆయన ఆసక్తి కనబరచనున్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!