.jpg&w=3840&q=75)

ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రముఖ నిర్మాత, అలాగే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. అసోసియేషన్ ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతో ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తున్న కార్యవర్గం త్వరలో డైమండ్ జూబిలీ (60 ఏళ్ల) వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజును అభినందించారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లతో తాను నిర్మిస్తున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ భేటీలో గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, జాయింట్ సెక్రటరీలు పర్వీన్, శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, కుమార్ మరియు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ వాసు పాల్గొన్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!