

ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో పరిశ్రమలో ఆయన స్థానం దెబ్బతింది. దీనికి తోడు తాజాగా ఒక వివాదం కూడా వెలుగులోకి రావడం ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది.
గత సంవత్సరం మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఒకటి సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ కాగా, మరొకటి శివకార్తికేయన్ నటించిన మదరాసి. ఈ రెండు సినిమాలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. మదరాసి నిర్మాత ఎన్వీ ప్రసాద్, సినిమా బడ్జెట్ మొదట చెప్పిన దానికంటే ఎక్కువగా పెరిగిందని, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఖర్చులు అధికమయ్యాయని పేర్కొంటూ ఫిర్యాదు చేశారు.
ఈ వివాదంలో భాగంగా నష్టపరిహారంగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్మాత కోరినట్లు సమాచారం. అయితే ఇరువర్గాల మధ్య చర్చల అనంతరం ఒక పరిష్కారం దొరికింది. మురుగదాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కథను ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో, ఈ వివాదం తర్వాత ఆయన తిరిగి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!