

పంతొమ్మిదో సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఛేజింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌ను కట్టడి చేసిన పంజాబ్‌కు కూపర్ కొన్నొల్లి (74 నాటౌట్) ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37) మెరుపులతో లక్ష్యాన్ని సులభంగా చేరుకునేలా కనిపించినప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిధ్ కృష్ణ (3/29) వరుస వికెట్లతో పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయినప్పటికీ చివరిదాకా క్రీజ్‌లో నిలిచిన కూపర్, జేవియర్ బార్ట్‌లెట్ (11 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
పద్దెనిమిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్, పంతొమ్మిదో సీజన్‌ను విజయంతో ఆరంభించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై వికెట్ల తేడాతో గెలుపొందింది. కీలక ఆటగాళ్లు విఫలమైనప్పటికీ, కూపర్ కొన్నొల్లి (74 నాటౌట్) తన అర్ధశతకంతో జట్టును విజయానికి నడిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, చివరి వరకు క్రీజ్‌లో నిలబడి పంజాబ్‌ను గెలిపించాడు. ముల్లన్‌పూర్‌లో గుజరాత్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్‌కు కగిసో రబడా తొలి దెబ్బ ఇచ్చాడు. ప్రమాదకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7) అశోక్ శర్మ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు.
7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన సమయంలో, కూపర్ కొన్నొల్లి మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37)తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. రెండో వికెట్‌కు ఈ జంట 76 పరుగులు జోడించి జట్టును గాడిలో పెట్టింది. అయితే రషీద్ ఖాన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. చివరికి కూపర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్‌ను విజయ తీరాలకు చేర్చాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!