
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేపటి నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. సభ్యులు తమకు నచ్చిన క్రీడలను ఎంపిక చేసుకుని పాల్గొనే అవకాశం కల్పించగా, ఇప్పటికే సభ్యుల నుంచి దరఖాస్తులు అందాయి. క్రికెట్‌తో పాటు క్యారమ్స్, టెన్నిస్ తదితర పలు క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేల క్రికెట్ పోటీల్లో రెండు జట్లకు మంత్రి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహించనున్నారు. మరో జట్టుకు పవన్ కళ్యాణ్ కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రీడా పోటీలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు క్రీడా స్పూర్తిని ప్రోత్సహించనున్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!