

మొంథా తుఫాన్ కారణంగా ఇటీవల తీర ప్రాంతాల్లో జరిగిన భారీ నష్టాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నవంబర్ 22న బంగాళాఖాతంలో కొత్త తుఫాన్ రూపుదిద్దుకునే అవకాశముందని, దీనిపై విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ-తూర్పు బంగాళాఖాతంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ వ్యవస్థ పడమర-ఉత్తర పడమర దిశగా కదులుతూ, దక్షిణ-పశ్చిమ బంగాళాఖాతంలో వేగంగా తీవ్రత పెంచుకుంటుందని అంచనా ఉంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం ప్రకాశం, శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశముంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!