

అల్లు వారి ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. నటుడు అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తొలి శుభలేఖను అల్లు శిరీష్ తన మావయ్య, అగ్ర కథానాయకుడు చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ దంపతులు చిరంజీవి దంపతులకు నూతన వస్త్రాలు అందించి వివాహానికి ఆహ్వానించారు. గత ఏడాది అక్టోబర్లో శిరీష్ తన ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం చేసుకోగా, మార్చి 6న వీరి వివాహం జరగనుంది. విశేషం ఏమిటంటే, అల్లు అర్జున్ – స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో ఇదే తేదీన జరిగింది.
శిరీష్-నయనికల ప్రేమ ప్రయాణం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలో ప్రారంభమైంది. ఆ పెళ్లికి నటుడు నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. షాలినితో వచ్చిన ఆమె స్నేహితురాలు నయనికను అక్కడే తొలిసారి చూసినట్లు శిరీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ పరిచయం స్నేహంగా మారి, తరువాత ప్రేమగా వికసించిందని వెల్లడించారు. భవిష్యత్తులో తమ పిల్లలు అడిగితే ఈ ప్రేమ కథనే చెబుతానని, తనను తమ సర్కిల్లో చేర్చుకున్న నయనిక స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!