

రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన మరింత విషాదకరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, చికిత్స పొందుతూ రాధాకృష్ణమూర్తి (74), ఎన్.శేషగిరిరావు (72), తాడి రమణి (58) సోమవారం కన్నుమూశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇథలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ రసాయనం పాలలో కలిసినట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. పాల వ్యాపారి గణేష్‌ను అరెస్టు చేసి, ఆయనపై నాలుగు హత్య కేసులు నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, బాధితుల చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని సీఎం తెలిపారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఘటన మూలాలు తెలుసుకునేందుకు 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. రక్త, మూత్రం, పాల నమూనాలను విశాఖ, విజయవాడ, హైదరాబాద్ ప్రయోగశాలలకు తరలించారు. ఫలితాలు రావడానికి మూడు నుంచి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చిన్నారులు సహా పలువురు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!