
క్రీడలు

వరంగల్‌లోని జాతీయ సాంకేతిక శిక్షణ సంస్థ (నిట్)లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సృజనాత్మక, సాంస్కృతిక ఉత్సవం ‘స్ప్రింగ్‌స్ప్రీ-2026’ను ప్రముఖ నటుడు, దర్శకుడు అడివి శేష్ గురువారం సాయంత్రం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. యూరప్‌లో సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నప్పటికీ విద్యార్థులను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. లక్ష్య సాధనలో ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.
స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ముఖ్య దృశ్యాలను తెరపై ప్రదర్శించారు. అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ప్రదర్శించగా విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!