

ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు, చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న గ్రేడ్-2 ఉద్యోగి నివాసాలే ఈ సోదాల లక్ష్యంగా మారాయి.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్. శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదులతో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి నల్లపోగు తిరుమలేశ్కు సంబంధించిన తిరుపతి, రేణిగుంట, నెల్లూరు జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బంధువుల పేర్లపై ఆస్తులు నమోదు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!