

విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళన నెలకొంది. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు కేవలం కొన్ని నెలల క్రితం, జూలై నెలలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ కావడం విశేషం.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి జరిగిన కిడ్నాప్ ఘటన పశ్చిమ మాలీలోని కోబ్రీ సమీపంలో చోటుచేసుకుంది. విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న భారతీయ కార్మికులను ముష్కరులు అపహరించారు. ఈ సంఘటన తరువాత కంపెనీ ఇతర భారతీయ ఉద్యోగులను రాజధాని బమాకోకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే బాధితుల వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ ఘటనకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద గ్రూప్ బాధ్యత వహించలేదు. ప్రస్తుతం సైనిక జుంటా పాలనలో ఉన్న మాలి, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులతో తీవ్ర అశాంతిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లిమ్స్ (GSIM) కార్యకలాపాలు ఈ దేశంలోని భద్రతా పరిస్థితులను మరింత దెబ్బతీస్తున్నాయి.
2012 నుండి మాలి దేశంలో తిరుగుబాట్లు, ఘర్షణలు సాధారణంగా మారడంతో, విదేశీయులను లక్ష్యంగా చేసుకున్న కిడ్నాపులు పెరిగిపోయాయి. జూలైలో ముగ్గురు భారతీయులను, సెప్టెంబర్లో ఇద్దరు ఎమిరాటీలు మరియు ఒక ఇరానియన్ను జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అనంతరం వారు కొంత మొత్తంలో డబ్బు చెల్లించడంతో విడుదలైనట్లు సమాచారం.
ఈ తాజా ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి అధికారులతో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!