
గాసిప్స్

భారత సైన్యం సోషల్ మీడియా వినియోగంపై నిబంధనలను కొంత సడలించినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్, X వంటి యాప్‌లను సైనికులు మరియు అధికారులు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అనుమతి కేవలం సమాచారం తెలుసుకోవడం మరియు కంటెంట్ చూడటానికే పరిమితం.
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అనుమతించలేదని తెలుస్తోంది. హనీ ట్రాప్‌ల వంటి భద్రతా ముప్పులు ఉన్న నేపథ్యంలో, కఠిన భద్రతా నియమాలు పాటిస్తూ ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు సమాచారం. భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా సైనికులు అప్డేట్స్ తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!