
బిజినెస్

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పౌల్ట్రీ రైతులను ఒక అజ్ఞాత వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఒకే రోజు దాదాపు 10 వేల కోళ్లు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో చిన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో సుమారు 5 వేల కోళ్లు మృతి చెందాయి. అలాగే నాగర్‌కర్నూల్ మండలంలోని రాంరెడ్డిపల్లి తండాలో 1500 కోళ్లు చనిపోయాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపు 4 వేల కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటన వెనుక ఉన్న వైరస్ ఏంటో తెలుసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కోళ్లకు సోకిన వైరస్ పై పూర్తి స్థాయిలో పరిశీలన చేయడానికి ఈ రోజు ఫోరెన్సిక్ నిపుణులు నాగర్‌కర్నూల్‌కు రానున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!