

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'డ్రాగన్'. ఈ సినిమాపై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. తన లుక్‌పై ఎన్టీఆర్ సంతృప్తి చెందకపోవడంతో ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్లను పక్కన పెట్టేశారని, షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ పుకార్లను పూర్తిగా ఖండించాయి. షూటింగ్ ఎక్కడా కూడా ఆగలేదని, ప్రస్తుత విరామం కేవలం తదుపరి షెడ్యూల్ సన్నాహాలు, ఎన్టీఆర్ లుక్ ఫైనలైజేషన్ కోసమేనని క్లారిటీ ఇచ్చాయి. జోర్డాన్‌లో షెడ్యూల్ ప్రణాళికల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, ప్రొడక్షన్ మాత్రం సజావుగా సాగుతోందని నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిమల్ ఒబేరాయ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ముందు జూన్ 25న విడుదల చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యాల కారణంగా 2027కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.తారక్ అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాతల అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో మైలురాయి అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!