

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన ఆత్మాభిమానాన్ని వదులుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవన్‌రెడ్డి తన ఆత్మను చంపుకొని కేసీఆర్‌ను కౌగిలించుకున్నారని ఆయన విమర్శించారు. 40 ఏళ్లుగా అండగా ఉన్న పార్టీని వదిలి కేసీఆర్ “విషకౌగిలి”లోకి వెళ్లారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్‌తో కలిసి వెళ్లిన గతంలో కనిపించకుండా పోయిన సీనియర్ నాయకులను జీవన్‌రెడ్డి గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
కేసీఆర్ పాలనను “రాక్షస, అవినీతి పాలన”గా అభివర్ణిస్తూ, దానిపై తాను 10 ఏళ్లుగా పోరాటం చేశానని చెప్పుకునే జీవన్‌రెడ్డి ఇప్పుడు ఎలా కలిసి పనిచేయగలరని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అవినీతిపరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెప్పగలడా అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పోవాలని, కేసీఆర్ రావాలని ఏ సామాన్యుడు కోరుకున్నాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఆయన తిరిగి రావాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!