
టెక్నాలజీ

నటి నిధి అగర్వాల్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారానికి సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీత్ విన్‌తో పాటు మరికొన్ని బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్‌లో ఆమె పాత్రపై ప్రశ్నించినట్లు సమాచారం.
నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌కు సంబంధించిన కాంట్రాక్టులు, ప్రచార ఒప్పందాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రచారాల ద్వారా ఆమెకు అందిన రెమ్యునరేషన్, చెల్లింపులకు సంబంధించిన వివరాలపైనా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణ పూర్తయిన అనంతరం నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడకుండా ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!