

కోలీవుడ్ స్టార్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యోగిబాబు ఇప్పుడు హీరోగా సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వరుస కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, ప్రస్తుతం పూర్తిస్థాయి హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింగారం’. కేవీ కదిరివేలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో చార్లీ, రెడిన్ కింగ్స్‌లీ, వైజీ మహేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ బాలాజీ, పద్మావతి గాంధీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సింగారం’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా యోగిబాబు ఎక్స్ వేదికగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘‘ప్రపంచం లొంగిపోవాలని కోరినప్పుడు.. అతను ధైర్యాన్ని ఎంచుకుంటాడు. తన తలరాతనే తానే తిరగరాస్తాడు’’ అంటూ ఒక సామాన్యుడి అద్భుతమైన ప్రయాణంగా సినిమాను అభివర్ణించారు. ‘సింగారం’ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!