

కన్నడ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి సన్నివేశాలను తొలగించకుండా సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుండగా, సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
కన్నడ వెర్షన్‌లో కేవలం రెండు, మూడు పదాలను మాత్రమే మ్యూట్ చేసినట్లు సమాచారం. యశ్ కూడా ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అనువైనదని ఇప్పటికే సూచించారు. అయితే ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ ఒక్క సన్నివేశాన్ని కూడా తొలగించకపోవడంపై చర్చ మొదలైంది. పెద్దలకు మాత్రమే అనువైన కంటెంట్ ఉన్నప్పుడు ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ అనుమతి ఎలా ఇచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!