

బాలీవుడ్ నటి యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ దంపతులు ముంబై హడావుడికి, నిరంతర మీడియా దృష్టికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇకపై హిమాచల్ ప్రదేశ్‌ను తమ శాశ్వత నివాసంగా మార్చుకోవాలని ఈ జంట భావిస్తోంది. అయితే సినిమాలు, ఇతర ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ల కోసం ముంబైకి రాకపోకలు కొనసాగించనున్నారు. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచే యామీ, ఆదిత్య ఇప్పుడు ప్రశాంతమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
యామీ గౌతమ్‌కు హిమాచల్ ప్రదేశ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. వివాహానికి ముందే మండి జిల్లాలోని గోహర్ ప్రాంతంలో సుమారు 100 ఏళ్ల నాటి హెరిటేజ్ ఇంటిని ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి యామీ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. 2021లో యామీ, ఆదిత్య ధర్‌ల వివాహం కూడా ఇదే ప్రదేశంలో జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతాన్ని శాశ్వత నివాసంగా ఎంచుకోవడం పట్ల అభిమానులు ఈ జంట నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!