

యువతలో మారుతున్న జీవనశైలిని ప్రతిబింబించేలా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మధుదీప్ చెలికాని రూపొందించిన ఈ కుటుంబ కథా చిత్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నగర జీవితాన్ని వదిలి గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం ప్రధాన కథాంశంగా చూపిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కుటుంబంలో ఏర్పడే సమస్యలు, ప్రేమ, భావోద్వేగాలను హాస్యంతో మేళవించి చూపించినట్లు చిత్ర బృందం తెలిపింది.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో జరిగే అనుభవాలను సినిమాలో చూపించామని అన్నారు. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కుటుంబ సంబంధాలపై చూపిన ప్రభావాన్ని సరదాగా ప్రెజెంట్ చేశామని తెలిపారు. అనీష్ కురువిల్లా, శివాజీ రాజా, వైవా హర్ష, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా ప్రేక్షకులకు చేరవేస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!