

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది అభిమానుల సమక్షంలో మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఏముందో నేను చెప్పను, కానీ చూశాక మీరు షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా!” అని పబ్లిక్‌గా ప్రకటించారు.
సాధారణంగా రిలీజ్‌కు ముందు నటీనటులు తమ సినిమాపై నమ్మకం చూపిస్తూ ఇలాంటి మాటలు చెబుతారు. గతంలో కొందరు యూత్ హీరోలు కూడా “హిట్ కాకపోతే పేరు మార్చుకుంటా”, “ఇక సినిమాలు చేయను” అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ మాట మీద ఎవరూ నిలబడలేదు. ఇవన్నీ ప్రమోషనల్ స్ట్రాటజీల భాగమే.
మాస్ జాతర బాగానే ఉండొచ్చు. కానీ “షాక్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేస్తా” అన్నంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజానికి, రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి చేసిన జోకులు, ఎస్.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆలీపై చేసిన హాస్యం లాంటివి కూడా అప్పట్లో మిస్‌ఫైర్ అయ్యాయి. ఇప్పుడు మాస్ జాతర వేదికపై మరోసారి ఆయన మాటలే హాట్ టాపిక్ అయ్యాయి.
ఇలాంటి సందర్భాల్లో సీనియర్ నటులు కొంత ఆత్మనిగ్రహం పాటించడం మంచిది. “ఇండస్ట్రీ వదిలేస్తా” అని చెప్పడం ఈజీ కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కోట్ల రూపాయల బడ్జెట్లతో రూపొందుతున్న సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు అనవసరమైన ట్రోలింగ్కి దారితీయొచ్చు.
మాస్ జాతరలో రాజేంద్రప్రసాద్ రవితేజ తాతయ్య పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరి మధ్య బాండింగ్, ఎపిసోడ్లు చాలా బాగా వచ్చాయని టాక్ ఉంది. ఆ ఉత్సాహంలోనే ఆయన అలా మాట్లాడారేమో కానీ, ఆయన వదిలేస్తానన్నా టాలీవుడ్, అభిమానులు ఆయనను అంత ఈజీగా వదలరు!








.avif&w=3840&q=75)


కామెంట్స్ (2)
Can’t wait to see him in Mass Jathara
Waiting eagerly for Mass Jathara.