

థియేటర్లలో విడుదలైన సినిమాలు కొంతకాలానికి టీవీ ఛానళ్లలో ప్రసారం కావడం సాధారణమే. అయితే థియేటర్లలో ప్రదర్శించిన అదే రూపంలో ప్రతి చిత్రాన్ని టీవీలో చూపించలేరు. టెలివిజన్ ప్రసారాలకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా ‘ఎ’ సర్టిఫికేట్ పొందిన సినిమాలకు టీవీ ప్రసారం సమయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అవసరమైన ధృవీకరణ పొందిన తర్వాతే ప్రసారం చేయాల్సి రావడంతో.. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు తొలగించిన రూపంలో ప్రేక్షకులకు కనిపిస్తాయి.
మరోవైపు ఓటీటీ వేదికలకు థియేటర్, టీవీ మాదిరిగా ముందస్తు సీబీఎఫ్‌సీ ధృవీకరణ విధానం ఉండదు. అక్కడ వయసు పరిమితులు, కంటెంట్ హెచ్చరికలు, స్వీయ నియంత్రణ వంటి విధానాలు అమలులో ఉంటాయి. అందుకే ఒకే సినిమా అయినా థియేటర్, టీవీ, ఓటీటీ వేదికల్లో కనిపించే రూపం భిన్నంగా ఉండొచ్చు. ప్రసార మాధ్యమాన్ని బట్టి కంటెంట్‌కు సంబంధించిన నియమాలు మారుతాయన్నమాట.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!