

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఈసారి ఆయన కొత్త సినిమా ప్రకటనతో కాదు.. తన మొబైల్ ఫోన్‌లో కనిపించిన ఓ చిన్న విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘సింగ్ గీతం’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్, నిర్మాత నాగ్ అశ్విన్‌తో కలిసి సరదా సంభాషణలో పాల్గొన్నాడు. ఆ సమయంలో క్షణకాలం కనిపించిన ఆయన ఐఫోన్ లాక్ స్క్రీన్ ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రభాస్ ఫోన్‌లో వాల్‌పేపర్‌గా ‘కల్కి’ సినిమాలోని కర్ణుడి అవతారానికి సంబంధించిన పోస్టర్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో పాత్రలు చేసినప్పటికీ, కర్ణుడి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సన్నివేశాన్ని గమనించిన అభిమానులు వెంటనే స్క్రీన్‌షాట్లు తీసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకుంటున్నారు. కారణం ఏదైనా సరే, ప్రభాస్‌కు సంబంధించిన ఈ చిన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలో ఆయన పేరు మరోసారి ట్రెండ్ అవుతుండగా, అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!