
క్రీడలు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు చూపించిన ప్రేమకు ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా తనకు అందిన శుభాకాంక్షలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన మహేష్.. అభిమానులు మరింత గర్వపడేలా కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుంచి వచ్చిన సర్‌ప్రైజ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
‘వారణాసి’ తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని మహేష్ బాబు తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నానని, ఆ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. మహేష్ బాబు విడుదల చేసిన ఈ ప్రత్యేక సందేశం అభిమానుల్లో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!