

‘పెద్ది’ సినిమా విడుదల అనంతరం జాన్వీ కపూర్ పాత్రపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విడుదలకు ముందు దర్శకుడు బుచ్చిబాబు ఆమె పాత్రను ఎంతో ప్రత్యేకంగా అభివర్ణించినప్పటికీ, సినిమాలో ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు వినిపించాయి. సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొన్న జాన్వీ, పాత్రపై నెగెటివ్ కామెంట్లు వచ్చిన తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు సమాచారం. ‘తుంబడ్’ ఫేమ్ దర్శకుడు అనిల్ బార్వే తెరకెక్కించనున్న క్రియేచర్ హారర్ థ్రిల్లర్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. జియో స్టూడియోస్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశముంది. అలాగే ‘లగ్ జా గలే’ చిత్రంలో కూడా జాన్వీ నటిస్తోంది. మరోవైపు ‘దేవర 2’లో ఆమె పాత్రపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈసారి మరింత ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!