

ఇంద్రా కంపెనీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.4 గా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ (వస్తే వదలం)’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని రాంబాబు స్టూడియోలో ఘనంగా లాంచ్ అయ్యింది. ఈ చిత్రాన్ని కొర్రాల సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు పోస్టర్‌ను ఆవిష్కరించి, కొత్త దర్శకులు మరియు కొత్త ప్రతిభను ప్రోత్సహించడం పరిశ్రమకు అవసరమని పేర్కొంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శక-నిర్మాత కొర్రాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, యువతకు కనెక్ట్ అయ్యేలా ప్రేమ, నమ్మకం, ద్రోహం, క్రైమ్, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా సాగుతుందని చెప్పారు. హీరోగా మదన్ బాబు నటిస్తుండగా, ప్రియాంక, సుష్మ, మహీరా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ డీఓపీ సూర్య అద్భుతమైన విజువల్స్ అందించనుండగా, సంగీత దర్శకులు విజయ్ బొల్లా, అర్జున్ దేవ్ యువతను ఆకట్టుకునే పాటలను అందించనున్నారు. మదన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి హైదరాబాద్, గోవా ప్రాంతాల్లో రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!