

వెర్సటైల్ హీరో విశాల్ తన 35వ చిత్రం మకుటంతో బిజీగా ఉన్నారు. స్టార్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దుషారా విజయన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని తొలి పాటకు మంచి స్పందన లభించిన తర్వాత, తాజాగా రెండో సింగిల్ నచాకే వచ్చెరా పాటను చిత్రబృందం ఘనంగా విడుదల చేసింది. జానపద శైలిలో రూపొందిన ఈ మాస్ బీట్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా విశాల్ తన ఎక్స్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా స్పందించారు. చాలా కాలం తర్వాత అభిమానులను కలవడం ఆనందంగా ఉందని, వారు చూపుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. బ్రిందా మాస్టర్ కొరియోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ వేడుకలు ప్రారంభించాలని అభిమానులను కోరారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట మాస్ బీట్‌తో నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!