

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియు నేచురల్ నటనకు పేరుగాంచిన సాయి పల్లవి జంటగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ చిత్రం జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేయాలని దర్శకుడు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 40 నుంచి 50 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్స్ రూపొందించినట్లు సమాచారం.
ఉగాది సందర్భంగా ప్రకటించిన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం లో సీత పాత్ర పోషిస్తోంది. ఇక ఆమె ధనుష్ సరసన డి55 అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి–సాయి పల్లవి కలయిక మొదటిసారి కావడం విశేషం. ఈ ఇద్దరి నటన, తెరపై కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!