

బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన హీరో విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తాను విషెస్ చెప్పానని, అవి చూసిన తర్వాత విజయ్ స్వయంగా తనకు ఫోన్ చేశారని తెలిపారు. తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన విజయ్.. తన కుమారుడు ఆ విషెస్ చూసి చాలా సంతోషించాడని చెప్పినట్లు సేతుపతి వెల్లడించారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ విజయ్ చాలా సింపుల్‌గా ఉంటారని ఆయన అన్నారు. ‘జన నాయగన్’ షూటింగ్ సమయంలో విజయ్‌ను కలిసినప్పుడు కూడా ఆయన చాలా క్యూట్‌గా అనిపించారని చెప్పారు.
మరోవైపు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైలర్ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపిస్తానని చెప్పారు. రజనీకాంత్ మల్టీ టాలెంటెడ్ అని, షూటింగ్ సెట్‌లో ఒకేసారి పలు విషయాలను చూసుకుంటారని ప్రశంసించారు. రిహార్సల్స్ లేకుండానే డైలాగ్స్ చెప్పగల ఆయన ప్రతిభ తనను ఆకట్టుకుందని తెలిపారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఆయనపై తన అభిమానాన్ని మరింత పెంచిందని చెప్పిన సేతుపతి.. రజనీకాంత్‌లా అంకితభావంతో పనిచేసే నటుడిగా మారడమే తన చివరి కోరిక అని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!