

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నేతలు ఓటు వేయనివ్వకుండా తమను బెదిరిస్తున్నారంటూ కొందరు మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యేపై కొందరు దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన భద్రత కోసం ఉన్న గన్‌మెన్ అడ్డుకోవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన గన్‌మెన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో బెస్తరపల్లిలో ఆందోళన నెలకొంది. గన్‌మెన్ ఆరోగ్య పరిస్థితి, ఘటనపై పోలీసులు తీసుకున్న తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!